ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం నానే వరువేన్. తెలుగులో నేనే వస్తున్నా. కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ సమర్పణలో అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ధనుష్‌కు జోడీగా ఎల్లిడ్ అవ్రమ్ హీరోయిన్‌గా నటిచింది. ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కళైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. చిత్రంలో ధనుష్ డ్యుయల్ రోల్‌లో నటించాడు. హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను ధనుష్ ఈ చిత్రంలో పోషించాడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ని కళైపులి ఎస్.థాను కలిశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్ రాజా, కెమెరా, ఓం ప్రకాష్.














