Namaste NRI

కుబేర నుంచి ధనుష్, రష్మిక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కుబేర.   రష్మిక కథానాయికగా.  ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్‌ చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ధనుష్‌, రష్మిక ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ పోయిరా పోయిరా మామ చార్ట్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిందని, ఈ పాటతో కుబేర పై హైప్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరుకుందని, దర్శకుడు శేఖర్‌ కమ్ముల నెవర్‌ బిఫోర్‌ అనిపించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారని నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై.లిమిటెడ్‌, ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events