ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానా యికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ కీలక పాత్రలో కనిపంచనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఈ సినిమా గురించి బాలీవు డ్ ప్రేక్షకులకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఉత్తరాది డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రము ఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. నిర్మాతలు కరణ్‌జోహార్, అనిల్ తండానీ నార్త్‌లో రిలీజ్ చేయబోతున్నారు. నార్త్ బెల్ట్‌లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాత కరణ్‌జోహార్ పేర్కొన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త.