సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ నాయికానాయకులుగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్ర ధర్మ చక్రం. పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు రోజూ చూస్తున్నాం. వీటిని అరికట్టేలా, అమ్మాయిలకు స్వీయ రక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కథనాయిక ద్విపాత్రాభినయం చేస్తోందన్నారు. నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలే ఇందులో కథాంశం అన్నారు. ఈ చిత్రానికి నాగ్ ముంత దర్శకుడు. ఎ.శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. సంగీతం: ప్రణయ్ రాజుపుటి, ఛాయాగ్రాహకుడు: ఎం. ఆనంద్. సెప్టెంబర్లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.














