Namaste NRI

లాస్ ఏంజెల్స్ లో ధీమ్‌ తానా-2025 పోటీలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ద్వైవార్షిక 24 వ మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ నగరాల్లో ధీమ్‌ తానా పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ధీమ్‌ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన నందన్ పొట్లూరి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  క్లాసికల్ సోలో సింగింగ్‌, ఫిల్మీ సింగింగ్‌ మరియు  గ్రూపు డ్యాన్స్‌ విభాగాలతో ప్రేక్షకులను అలరింప చేసింది. ఇందులో ముఖ్యంగా జూనియర్ కేటగిరి మరియు సబ్ జూనియర్ కేటగిరి పిల్లలు వారి పాటలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టాస్క్, లాటా, నాట్స్, ఆలంబన ఫౌండేషన్, ఏకం USA, లారా మరియు తాన ప్రతినిధులు హాజరు అయి విజేతలకు మెడల్స్ అండ్ ట్రోఫీస్ బహుకరించారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో లాస్ ఏంజెల్స్ లో ఉన్న పలువురు తానా నాయకులు మరియు లోకల్ ఆర్గనైజషన్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. పూర్వపు తాన రీజినల్ ప్రతినిధి, సురేష్ కందేపు మాట్లాడుతూ తాన టీం స్క్వైర్ గురుంచి వివరించారు. ప్రస్తుత తాన రీజినల్ ప్రతినిధి హేమకుమార్ గొట్టి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

Social Share Spread Message

Latest News