Namaste NRI

ధూం ధాం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

సాయికిశోర్‌ మచ్చా  దర్శకత్వంలో రూపొందిన లవ్‌ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ ధూం ధాం. చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటించారు. ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడారు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే ఎంటైర్టెనర్‌ ఇది. శ్రీనువైట్ల కామెడీని, వైవీఎస్‌ చౌదరి సాంగ్స్‌ స్టైల్ ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ మూవీ చేశాను. నిర్మాత రామ్‌కుమార్‌ సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మీ టికెట్‌ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం  అని అన్నారు.

అతిథులుగా విచ్చేసిన దర్శకులు శ్రీనువైట్ల, వైవీఎస్‌ చౌదరి, సాయిరాజేశ్‌, నిర్మాతలు దామోదరప్రసాద్‌, బెక్కెం వేణుగోపాల్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. బ్యూటిఫుల్‌ విజువల్స్‌, మంచి పాటలు ఉన్న సినిమా ఇదని, తన కుమారుడు చేతన్‌కి ఈ సినిమా మంచి బ్రేక్‌ అవుతుందని, సాయికిశోర్‌ మచ్చా దర్శకత్వం, గోపీసుందర్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రధాన బలాలని నిర్మాత రామ్‌కుమార్‌ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌లతోపాటు, నటులు సాయికుమార్‌, బెనర్జీ, గోపరాజు రమణ, నవీన్‌, ప్రవీణ్‌, గిరిధర్‌, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events