విదేశీగడ్డపై ప్రవాస భారతీయులే భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో 17వ ప్రవాస భారతీయ దివస్ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై బ్రాండ్ అంబాసిడర్లుగా భావిస్తున్నా. మీ పాత్ర విభిన్నం. యోగా, ఆయుర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చిరుధాన్యాల విషయంలో మీరు బ్రాండ్ అంబాసిడర్లు. వసుధైక కుటుంబం అనేభావన మీవల్లే బలోపేతమవుతుంది అని అన్నారు. భారత్ నుంచి ఇతర దేశాలకు వలసవెళ్లిన అనేక మంది దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, అలాంటివారి జీవిత గాథలను, కష్టాలను, సాధించిన విజయాలను డాక్యుమెంట్‌గా రూపొందించి విద్యార్థులకు అందించాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు ప్రధాని సూచించారు. ఈ కార్యక్రమానికి సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్‌సాద్ సంతోఖి, గుయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.