రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఓ హత్య కేసు విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో ఈ ఫస్ట్‌గ్లింప్స్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. పెరిగిన గడ్డంతో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టయిలిష్‌గా కనిపిస్తున్నారు. వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా? వంటి బ్యాక్‌గ్రౌండ్ సంభాషణలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్, సంగీతం : అనూప్‌రూబెన్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : జీవితా రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకురాలు. బీరం సుధాకర్‌రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట్ శ్రీనివాస్ నిర్మాతలు. మలయాళంలో విజయవంతమైన జోసెఫ్‌కి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం.