అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ చట్టరీత్యా నేరం. కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది. అబార్షన్ కోసం ఎక్కువగా మిఫిప్రాస్టాన్ మాత్రలను వేసుకుంటారు. ఈ గర్భనిరోధక మాత్రలపై తాజాగా ఆ దేశంలోని రెండు కోర్టులు భిన్న తీర్పులను వెలువరించాయి. టెక్సాస్‌లో ఫెడరల్ జడ్జి గర్భనిరోధక మాత్రల పై నిషేధాన్ని ప్రకటించారు. మరో వైపు వాషింగ్టన్ కోర్టు మాత్రం ఆ అబార్షన్ పిల్ కనీసం 12 రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. దీంతో గర్భనిరోధక మాత్రలపై సందిగ్ధత నెలకొన్నది. మిఫిప్రిస్టోన్ గురించి ఏడాది నుంచి అమెరికా కోర్టులో తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
మహిళలు శృంగారం చేసిన తర్వాత గర్భం దాల్చకుండా ఉండేందుకు అబార్షన్ మాత్రలు వేసుకుంటారు. మిఫిప్రిస్టోన్ను ఆర్యూ 486గా కూడా పిలుస్తారు. ఈ మాత్రలను వేసుకుంటే ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీ అడ్డుకునే ఛాన్సు ఉంది. ఇక మిసోప్రోస్టాల్ అనే మరో మాత్రను కూడా కొందరు వేసుకుంటారు. సంగమం తర్వాత 48 గంటలు దాటాకా ఈ మాత్రను వాడుతారు. దీని వల్ల బ్లీడింగ్ జరిగి గర్భాశయ ప్రదేశం అంతా ఖాళీ అవుతుంది. అబార్షన్ పిల్స్‌ను ఇంటి వద్దే వాడవచ్చు. పెద్దగా మెడికల్ సెట్టింగ్ అవసరం లేదు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ మిఫిస్ట్రాన్, మిసోప్రోస్టోల్‌కు 2000 సంవత్సరంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. గర్భం కన్ఫార్మ్ అయిన 10 వారాల వ్యవధి వరకు ఈ మాత్రలను వాడవచ్చు. ఒకవేళ ఆ సమయం దాటితే, అప్పుడు వాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధతిలో గర్భాన్ని తొలగిస్తారు. అమెరికాలో అబార్షన్ ఖర్చు సగటున 580 డాలర్లు ఉంటుంది. ఎక్కువలో ఎక్కువగా ఆ ఖర్చు 800 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.