ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా… ఆయన గౌరవార్థం శ్వేతసౌధం ఏర్పాటు చేసిన విందుకు పారిశ్రామిక వేత్తలు బిలియనీర్లు టెక్ దిగ్గజాలు ఫ్యాషన్ ఐకాన్ లు హాజరయ్యారు. అధ్యక్షుడు జోబైడెన్ ప్రథమ మహిళ జిల్ దాదాపు 400 మంది అతిథుల ను ఈ విందుకు ఆహ్వానించారు. శ్వేతసౌధం సౌత్ లో ఉన్న లాన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ లో ఈ విందు జరిగింది.
ఈ విందు లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్ పర్సన్ నీతా అంబానీ, భారత బిలియనీర్ ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ యాపిల్ సీఈవో టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం ఇంద్రానూయి, మానవహక్కుల ఉద్యమకర్త మార్టిన్ లూథర్ కింగ్-3, టెన్నిస్ ఆటగాడు బిల్లీ జేన్ కింగ్ సినీ ప్రముఖుడు నైట్ శ్యామలన్, ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లౌరెన్, వ్యాపారవేత్త ఫ్రాంక్ ఇస్లామ్ గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్ ఉన్నారు. ఇక ఇండో`అమెరికన్ చట్టసభ సభ్యులు రోఖన్నా, ప్రమీలా జయపాల్, జైడెన్ కుటుంబ సభ్యులు హంటర్, యాప్లే, జేమ్స్, నవోమీ బైడెన్ కూడా విందుకు హాజరయ్యారు.
ఈ విందు మెనూ లో దాదాపు వెజిటేరియన్ వంటకాలే ఉండటం గమనార్హం. మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందు మెనూ లో చిరుధాన్యాల వంటకాలనూ ప్రత్యేకంగా చేర్చారు. ఈ విందు లోని ఫస్ట్ కోర్స్ లో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, పుచ్చకాయ, అవకాడో సాస్ అందించగా.. ఇక మెయిన్ కోర్స్ లో స్టఫ్డ్ పోర్టబెల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వు తో కూడిన రిసోటో, లెమెన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు ఉన్నాయి.