
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తెరచాప. జోయల్‌జార్జ్ దర్శకత్వం. ఈ చిత్రానికి కైలాష్ దుర్గం నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మ్యాగీ ఆవిష్కరించారు. మత్స్యకారుల నేపథ్యంలో వారి జీవన సంఘర్షణ, పోరాటాన్ని చూపిస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. మాస్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాలో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు.మత్స్యకారుల నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత కైలాష్ దుర్గం పేర్కొన్నారు. జగదీష్ ప్రతాప్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: ప్రజల్ క్రిష్, ఎం.ఎల్.రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయెల్ జార్జ్.
