రవికాలె, అజయ్‌ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధ్ధన్ నిర్మాత. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్, శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు తేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శక్తివంతమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేటి వ్యవస్థలోని సమస్యలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, రచన-దర్శకత్వం: బాబ్జీ.