మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం. విశ్వంభర షూటింగ్ దశలో ఉండగా, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సెట్స్‌కు వెళ్లాడు డైరెక్టర్ వివి వినాయక్. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం మెంబర్స్‌కు విషెస్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే లాంఛ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే విశ్వంభర సెట్స్‌ను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్-షాలిని, పవన్ కల్యాణ్, రాంచరణ్ సందర్శించిన తెలిసిందే.