శాంతి చంద్ర, దీపిక సింగ్, శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డర్టీఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. జీ ఎస్ బాబు నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా టైటిల్ ఖరారు చేశారు. దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు టైటిల్ ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ మోషన్ పోస్టర్ బాగుంది. టైటిల్ జనాలకు చేరువయ్యేలా ఉండాలి. ఆ విధంగా ఈ డర్టీ ఫెలో టైటిల్ ఈ కథకీ సరిగ్గా సరిపోయింది. హీరో శాంతి చంద్ర, ఫైర్ వున్న నటుడు. ఈ సినిమాలో తన లుక్ బావుంది. దర్శకుడు మూర్తి సాయి గారు తన పంథా మార్చుకొని డాన్ సినిమాని తెరకెక్కించారని అనుకుంటున్నాను. మోహన్ రావుకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మరిన్ని సినిమాలు చేయ్యాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, సంగీత దర్శకుడు డాక్టర్ సతీష్, హీరో శాంతి చంద్ర, హీరోయిన్ శిమ్రితీ బతీజా, చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి, నటుడు కుమరన్ తదితరులు పాల్గొన్నారు.
