సౌత్ ఆఫ్రికా లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెండా పండుగను నిర్వహించారు. సౌత్ ఆఫ్రికా బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 27 న స్వేచ్ఛ , ఐక్యత యొక్క శక్తిని జరుపుకునే రెండు ముఖ్యమైన సంఘటనలు చరిత్రలో జరిగాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా ఆధ్వర్యంలో 1994లో ఆ దేశానికి స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం వచ్చిందన్నారు. తెలంగాణలో 2001 లో ఇదే రోజున, టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటుతో కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అంకురార్పరణ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడి రాష్ట్రానికి కొత్త గుర్తింపు, గర్వాన్ని తెచ్చిపెట్టిందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా సమీప పోలీస్ స్టేషన్ విక్టిమ్ ఎంపవర్మెంట్ సెంటర్ లో దుప్పట్లు పంపిణీ చేశారు. వారి ద్వారా పేదలకు ప్రతి సంవత్సరం శీతాకాలములో దుప్పట్ల పంపిణీ జరుగుతుందని ఆయన వివరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-186.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-131.jpg)
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కమిటీ సభ్యులు మేడసాని నరేందర్ రెడ్డి ,అరవింద్ చీకోటి, నవదీప్ రెడ్డి గుడిపాటి, సౌజన్ రావు, ఉమా మేహేశ్వర్ కుంట, రమణ అంతటి , హరిక్రిష్ణ వెంగల , రాకేష్ మోతూకూరి పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-131.jpg)