తానా ఫౌండేషన్ కార్యక్రమం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశం పొందిన 50 మంది బాలికలకు తానా ఎలెక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ రవి సామినేని, ట్రస్టీ శ్రీ విశ్వనాధ్ రగ్గులు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బండి నాగేశ్వరరావు , GCDO శ్రీమతి ఉదయశ్రీ , పాఠశాల SO రమా కుమారి, ఉపాద్యాయులు , 300 వందల విద్యార్థినిలు , సిబ్బంది పాల్గోన్నారు.
