Namaste NRI

తానా ఉపకార వేతనాలు, లాప్ టాప్ లు, కుట్టుమిషన్లు పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పౌండేషన్ ఆదరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు ఐదుగురికి ముఖ్య అతిథి నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదగా లాప్ టాప్ లు అందజేశారు. అలాగే 13 మంది విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్లు, పేద దర్జీలు ఐదుగురికి కుట్టుమిషన్లు అందజేశారు. పాలడుగు నీలమణి అనే ఇంజనీరింగ్ విద్యార్థికి కాలేజీ ఫీజు మొత్తం 40 వేల రూపాయలను వాషింగ్టన్ తెలుగు సమితి అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాస రావు సహాయం చేయగా జీవి ఆంజనేయులు చేతుల మీదగా నగదును అందజేశారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నిరు పేదలకు తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. పట్టణంలోని విష్ణుకుండినగర్ రామాలయంలో ఆదివారం జనవరి 2 న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తర అమెరికాలో తెలుగు సంఘం ద్వారా పేదలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శం అన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి ఆదరణ పొందాలని కోరారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మెన్ యార్లగడ్డ వెంకటరమణ, ఆదరణ ప్రాజెక్ట్ కోఆర్దినెటర్ సామినేని రవి మరియు దాత అబ్బూరి శ్రీనివాస రావు గారి సహాయాన్ని అందరూ అభినందించారు.

Social Share Spread Message

Latest News