కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వేడుకగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థానం బంగారు వాకిలి చెంత నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు, శ్రీవిష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక హారతులు ఇచ్చారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య దీపావళి ఆస్థానం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఇతర దేవతా మూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక హారతులు నివేదించారు. స్వామి, అమ్మవార్లు సహస్రదీపాలంకార సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)