Namaste NRI

అమెరికా – నెబ్రాస్కాలో అధికారికంగా దీపావళి వేడుకలు

భారతీయ విశిష్ట పండుగ దీపావళి పండుగను అధికారికంగా గుర్తించడంతోపాటు, అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్‌ జిమ్‌ పిల్లెన్‌ కార్యాలయం ప్రకటించింది. అలాగే అక్టోబర్‌ నెలను నెబ్రాస్కా రాష్ట్రంలో హిందూ హెరిటేజ్‌ మాసంగా కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. తరతరాలు గా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, సనాతన ధర్మం, సంస్కృతి  మరియు సంప్రదాయాల పరిరక్షణతోపాటు దీపావళి వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవడం కోసం అమెరికా లోని భారతీయ హిందూ సంఘం చేసిన గొప్ప కృషి వల్ల ఇది సాధ్యమైంది. నెబ్రాస్కా రాష్ట్రంలోని హిందూ సోదరులంతా దీపావళి వేడుకలను మరియు హిందూ వారసత్వ నెల ఉత్సవాలను మీ కుటుంబంతో, స్నేహి తులతో పాటు కమ్యూనిటీతో ఘనంగా జరుపుకోవాలని హిందూ నాయకులు కోరారు. 

  నెబ్రాస్కా స్టేట్‌ క్యాపిటల్‌ బిల్డింగ్‌ లింకన్‌లో వార్నర్‌ లెజిస్లేటివ్‌ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో భారతీయ సంస్కృతీ గొప్పతనాన్ని తెలియజేస్తూ, దీపావళి పండుగ ప్రాముఖ్యతపై ప్రసంగించిన డాక్టర్‌ ఫణి తేజ్‌ ఆది దం గారికి హిందువుల తరపున హృదయ పూర్వక ధన్యవాదములను తెలియజేశారు. అలాగే అధికారికంగా ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికి  మల్లికా జయంతి, కొల్లి ప్రసాద్‌, నవీన్‌ కంటెం, డాక్టర్‌ ఫణి తేజ్‌ ఆదిదం, వెంకట్‌ జయంతి, రాజా కోమటిరెడ్డి, టాటారావు కోసూరి, అనిల్‌ పోతినేని, తపన్‌ దాస్‌, శైలేందర్‌, అరుణ్‌ కుమార్‌ పాండిచ్చేరి, దేవిక పాండిచ్చేరి, మాధవి, పీయూష్‌ శ్రీవాస్తవ్‌, ప్రవీణ్‌ గుమ్మడవల్లి, శ్రీపత్‌ కాంబ్లే, రామకృష్ణ కిలారు తదితరులు విశేషంగా కృషి చేశారు. అధికారికంగా ప్రకటన రావడం పట్ల పలువురు కమ్యూనిటీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News