అమెరికాలో హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైనులు ఇలా లక్షలాదిమంది జరుపుకొనే దీపావళి పండుగను ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కాంగ్రెస్ చట్టసభ ప్రతినిధి గ్రేస్ మెంగ్(47) కోరారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈమె న్యూయార్క్ నుంచి డెమోక్రాట్ల తరపున కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభలో దివాళీ డే యాక్ట్‌ను ప్రవేశపెట్టిన గ్రేస్ మెంగ్ మాట్లాడుతూ ఇది కేవలం ఒక సెలవురోజు మాత్రమే కాదు. దీపావళి సంస్కృతిని, ఈ పండుగను చేసుకునే ఇండియన్ అమెరికన్ల సేవలను అర్థం చేసుకునే సందర్భం అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)