Skip to main content

Namaste NRI

డిఎన్‌కె పెద్ద విజయం సాధించాలి: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు

ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించిన క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ డిఎన్‌కె. మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ హీరోగా నటించిన ఈచిత్రానికి శ్రీను కంబాల దర్శకుడు. సుస్మితశెట్టి కథానాయిక. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో శ్రీవిష్ణు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ అలీ గారు ఇలాంటి మంచి పాత్రల్లో కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. డిఎన్‌కె కూడా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి మూటలు మూటలుగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుంది. సినిమా నవంబర్ 13న విడుదలవుతోంది. పెద్దలు అందరూ చూడండి. 14న పిల్లలందరినీ తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. పెద్ద హిట్ చేయండి అన్నారు.

హీరో మౌళి మాట్లాడుతూ ఇది చాలా వినోదాత్మకమైన సబ్జెక్ట్‌. దానికి తగ్గట్టే అందరూ హాయిగా నవ్వుకునేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ సినిమాను తెరకెక్కించారు.టీమ్‌ అంతా మనసుపెట్టి పనిచేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని నమ్మకం వెలిబుచ్చారు. ప్రతిష్టాత్మక మైత్రీ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉందని, ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశానని దర్శకుడు శ్రీను కంబాల చెప్పారు. ఇది తప్పక విజయం సాధించే సినిమా అని నిర్మాత రవిశంకర్‌ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు, వివేక్‌ ఆత్రేయ, శివనిర్వాణ, సాయిమార్తాండ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events