Namaste NRI

ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయకండి: భారతీయులకు సూచన

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భారీ స్థాయిలో క్షిపణులతో దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సూచలను జారీ చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దని భారతీయులకు సూచించింది. ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సహాయ సహకారాల కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిం చాలని కోరింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, భద్రతా పరిస్థితిలో తీవ్రతను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతీ య పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events