Skip to main content

Namaste NRI

హే భగవాన్‌.. నవ్వులు పూయిస్తోన్న సుహాస్ కొత్త సినిమా గ్లింప్స్‌

సుహాస్‌ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్‌ హే భగవాన్‌. శివాని నాగరం కథానాయిక. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. సుహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. సస్పెన్స్‌, కామెడీతో ఈ టీజర్‌ సాగింది. టీజర్‌లో సుహాస్‌ ైస్టెలిష్‌ ఎంట్రీ ఆకట్టుకుంటుంది.

శివాని నాగరం గ్లామరస్‌గా కనిపించింది. నా కలర్‌ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌ సినిమాలకు పనిచేసిన గోపి, నా సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. షణ్ముఖ ప్రశాంత్‌ అద్భుతమైన కథ అందించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది అని సుహాస్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా శివానీ నాగరం, నరేష్‌ వి.కె,లతోపాటు దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News