జనాభాలో భారతదేశం ఇప్పటికే చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం జనాభాలో మహిళల సంఖ్య కొంతమేర పెరగడంతోపాటు లింగ నిష్పత్తి కూడా మెరుగవుతుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వుమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2023 నివేదికలో వెల్లడించింది.
2036 నాటికి జననాల సంఖ్య తగ్గడంతో జనాభాలో 15 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, 60 ఏండ్ల పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో చివరిసారిగా 2011లో అధికారింగా జనాభా లెక్కలు నిర్వహించారు. 2021లో మరోసారి జరగాల్సి ఉండగా, ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తున్నది.
మొత్తం జనాభాలో మహిళల సంఖ్య : 2036 నాటికి – 48.8% (అంచనా) 2011లో- 48.5%. మెరుగవనున్న లింగ నిష్పత్తి.. (1000 మంది పురుషులకు మహిళలు) 2036 నాటికి-952(అంచనా) 2011లో-943.