మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. తన పిల్లలకు తన పూర్తి ఆస్తి సంక్రమించద న్నారు. తన ఆస్తిలో కేవలం ఒక్క శాతం మాత్రమే పిలల్లకు వారసత్వ హక్కుగా వెళ్తుందన్నారు. పిల్లలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని, వాళ్ల సక్సెస్ వాళ్లమీదే ఆధారపడి ఉంటుందని, వారసత్వ ఆస్తి కోసం వాళ్లు ఎదురుచూడవద్దు అని బిల్ గేట్స్ తెలిపారు. ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బిల్ గేట్స్ ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచాడు.

బిల్ గేట్స్ ఆస్తి సుమారు 155 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆయన పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్క శాతం ఆస్తి మాత్రమే సంక్రమించనున్నది. పిల్లల్ని బాగా పెంచామని, వారికి కావాల్సిన విద్యను అందించినట్లు చెప్పారు. అయితే తన ఆస్తికి చెందిన ఎక్కువ శాతం విరాళాలకు వెళ్తుందని, వారసత్వ సంక్రమణకు చెల్లదని బిల్ గేట్స్ పేర్కొన్నాడు. తన సంపాదన, ఆస్తి, పిల్లలపై ప్రభావం చూపకూడదన్నారు. తమ స్వంతంగా పిల్లలు సంపాదించుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
