Namaste NRI

జనవరి నాటికి ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ?

ఈ ఏడాది ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, జనవరి 1 నాటికి అది 800 కోట్లకు చేరుకుంటుందని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు 1 శాతం లోపేనని, అదే అమెరికాలో 0.53 శాతమని తెలిపింది. 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 పుట్టుకలు, రెండు చావులు సంభవిస్తాయని చెప్పింది. అదే అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం, ప్రతి 9.5 సెకన్లకు ఒక మరణం సంభవిస్తుందని తెలిపింది. అమెరికా చరిత్రలో 2020 దశాబ్దం అతి నిదానంగా 4 శాతం లోపే జనాభా వృద్ధి నమోదు చేసిన దశాబ్దంగా నిలిచిపోనుందని ది బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events