Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెసిడెన్షియల్‌  బిల్డింగ్‌  …. ఎక్కడో తెలుసా ? 

దుబాయ్‌లో 100 అంతస్తులతో ఓ హైపర్‌ టవర్‌ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ (నివాస భవనం)గా రికార్డు సాధిస్తుందని డెవలపర్లు చెబుతున్నారు.  బుర్జ్‌ బింఘట్టి జాకబ్‌ అండ్‌ కో రెసిడెన్సెస్‌ పేరుతో నిర్మించనున్న ఈ హైపర్‌ టవర్‌ పై భాగంపై కిరీటాన్ని పొలివుండేలా డైమండ్‌ ఆకారపు శిఖరాలు ఉంటాయి. ఈ భవనంలో డే కేర్‌, బాడీగార్డ్‌, డ్రైవర్‌, ప్రైవేట్‌ చెఫ్‌ వంటి సర్వీసులను అందించే బృందం ఉంటుంది. రెండు కంపెనీలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ భనవ నిర్మాణ డిజైన్‌ను తాజాగా విడుదల చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress