అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిం చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆ నిర్ణయాన్ని స్వాగతిం చారు. కానీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇంకా కమలా హ్యారిస్‌కు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించలేదని ఒబామా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
ఒబామా చాలా అప్‌సెట్‌లో ఉన్నారని, ఎందుకంటే ఆమె గెలవలేదని ఆయన అనుకుంటున్నట్లు బైడెన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ వ్యక్తి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలిగా అసమర్థురాలు అవుతుందని ఒబామా పేర్కొన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించాలని ఆయన భావించారు. ఒబామా చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఆయన అనుకున్న ట్లు జరగలేదని, అందుకే హ్యారిస్‌కు మద్దతు ఇచ్చే డెమోక్రటిక్ నేతల లిస్టులో ఆయన లేరని ఓ వ్యక్తి తెలిపారు.