Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లు, ఇంటర్వ్యూలను నిలిపివేసింది. వలసలపై కఠిన నియమాలు అమలు చేయడంలో భాగంగానే అపాయింట్‌మెంట్లను నిలిపివేసినట్టు యూఎస్‌ విదేశాంగశాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయబార కార్యాలయాల్లోని వీసా అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకే వీసా ఇంటర్వ్యూలను నిలిపివేసినట్టు యూఎస్‌ విదేశాంగశాఖ ప్రకటించింది.

అమెరికా ప్రభుత్వ ప్రజా సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు వీసా అధికారులకు శిక్షణ ఇస్తున్నట్టు అమెరికా తెలిపింది. ఇప్పటికే వీసాల కోసం ఐప్లె చేసుకున్న వారికి ఇంటర్వ్యూ రీ షెడ్యూల్‌ చేసినట్టు మెయిల్స్‌ ద్వారా సమాచారం వెళ్లింది. తాత్కాలిక వీసాలపై వచ్చి శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలి అనుకునేవారి వీసాలను గుర్తించి రద్దు చేసే ప్రక్రియను కూడా ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో దాదాపు 2లక్షలకు పైగా వీసాలు రద్దయ్యే అవకాశం ఉన్నది. అమెరికా వీసా ఇంటర్వ్యూలను ఆపేయడంతో అత్యవసరంగా చదువులు, ఉద్యోగాల కోసం ఐప్లె చేసుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events