అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమాయత్తమవుతున్నాడు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో తాను విజయఢంకా మోగించిన ప్రాంతాల నుంచే మరోసారి ప్రచారాన్ని చేపట్టాడు. 2024 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ట్రంప్ 2016 లో అమెరికా అధ్యక్షుడిగా ఒక దఫా ఉన్నారు. తన అధ్యక్ష ప్రచారాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ముందుగా ఓటింగ్ జరిగే ప్రదేశాలను సందర్శించడం ద్వారా ఆయన తన ప్రచారాన్ని మొదలెట్టారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన న్యూ హాంప్షైర్, సౌత్ కరోలినా నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు.