అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ తన వియ్యంకుడికి కీలక పదవి అప్పగించారు. పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా మస్సద్ బౌలోస్‌ను ఎంపిక చేసుకున్నారు. బౌలోస్ లెబనీస్-అమెరికన్ వ్యాపార వేత్త. ఆయన కుటుంబ సభ్యులకు నైజీరియా, లెబనాన్‌లలో వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్ చిన్న కుమార్తె టిఫ్ఫనీని బౌలోస్ కుమారుడు మైఖేల్ వివాహం చేసుకున్నారు. ట్రంప్ చార్లెస్ కుష్నర్‌ను ఫ్రాన్స్ రాయబారిగా ఎంపిక చేసుకున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌కు తండ్రి చార్లెస్ కుష్నర్.