అమెరికాలో 2024 లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే సంచలనం. ఆయన ఏది చేసినా, ఏది మాట్లాడినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్, ప్రైమరీ డిబేట్లకు మాత్రం తాను హాజరు కాబోనని తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయోవా లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ బార్‌లో తన మద్దతుదారులకు పిజ్జాలు పంపిణీ చేశారు. ఆ బార్‌లో వంద మందికిపైగా ప్రజలు గుమిగూడారు. ఆ సమయంలో ట్రంప్ తన చేత్తో పిజ్జా బాక్స్‌ను పట్టుకొని పిజ్జా ఎవరికి కావాలి? అంటూ వాటిని అక్కడున్న వారికి అందించాడు. అనంతరం వారందరికీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.