Namaste NRI

అధ్యక్ష ఎన్నికల ముంగిట చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దూసుకుపోతున్న ట్రంప్ మరో కోర్టు దెబ్బ ఎదుర్కొన్నారు. 2020 ఎన్నికల పరాజయ ఫలితాన్ని రద్దు చేసేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై స్థానిక ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. మరో నాలుగు అంశాల్లోనూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ దీనితో ఆయనపై దీనికి సంబంధించి క్రిమినల్ కేసులు దాఖలు కావడం ఇది మూడోసారి అయింది.

అమెరికానే మోసగించేందుకు ఆయన తన చర్యలతో కుట్ర పన్నారని , ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు, ప్రజాతీర్పును కాదనకుండా చేసేందుకు ఆయన పాల్పడ చర్యలతో చివరికి పౌరుల ఓటుహక్కును దెబ్బతీశారని 45 పేజీల అభియోగపత్రంపై విచారణ జరిగింది. అధికారిక కార్యకలాపాలను అడ్డుకున్నారని కూడా ఆయనపై నేరం మోపారు. కాగా, ట్రంప్‌ ఇప్పటికే రెండు తీవ్రమైన కేసుల్లో చిక్కుకున్నారు. ఓ శృంగార తారకు డబ్బులు చెల్లించిన కేసు, వైట్ హౌజ్ రహస్య పత్రాలను తరలించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events