అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ కు విదేశీ నేతల నుంచి భారీగా గిఫ్ట్ లు అందుకున్నారు. ఆ బహుమతుల విలువ సుమారు రెండున్నర లక్షల డాలర్లు ఉంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ అంచనా వేసింది. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు అందాయి. అయితే భారత ప్రధాని మోదీతో పాటు ఆ నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చారు. ఇక వాటి విలువ సుమారు 47 వేల డాలర్లు ఉంటుందని కమిటీ తెలిపింది. విదేశాల నుంచి అందిన అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ల వివరాలను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయలేదని కమిటీ తన రిపోర్టులో ఆరోపించింది.
ట్రంప్ ఫ్యామిలీ కి సుమారు వందకుపైగా విదేశీ గిఫ్ట్‌లు అందాయి. వాటి విలువ సుమారు 25 మిలియన్ల డాలర్లు ఉంటుంది. రిపోర్టులో ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం ట్రంప్‌కు ఇండియా నుంచే దాదాపు 17 ఖరీదైన గిఫ్ట్‌లు అందినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి వచ్చిన గిఫ్ట్‌ల మొత్తం విలువ 47 వేల డాలర్లు ఉంటుందట. దాంట్లో యోగి ఇచ్చిన 8500 డాలర్ల విలువైన ఫ్లవర్ వాస్‌తో పాటు 4600 డాలర్ల విలువైన తాజ్ మహల్ ప్రతిమ, రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన 6600 డాలర్ల విలువైన రగ్గు ఉన్నాయి. ప్రధాని మోదీకూడా 1900 డాలర్ల విలువైన కఫ్‌లింక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఫారిన్ గిఫ్ట్స్ అండ్ డెరేషన్ యాక్టు ప్రకారం ట్రంప్‌పై చర్యలు చేపట్టారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే మిస్సైన ఆ భారీ గిఫ్ట్‌లు ఎక్కడ ఉన్నాయన్న కోణంలో కమిటీ దర్యాప్తు చేస్తోంది. విదేశాంగ విధానం లో భాగంగా వివిధ దేశాధినేతలు ట్రంప్‌కు గిఫ్ట్ ఇచ్చారా లేదా అన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జేమీ రాస్కిన్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-47.jpg)