తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనెజువెలాకు ఏది మంచిదని అమెరికా భావిస్తున్నదో ఆ పని డెల్సీ చేయకపోతే మదురో కన్నా భయంకరమైన గతి ఆమెకు పడుతుంది అని ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రతిపాదనకు డెర్సీ రోడ్రిగ్స్ అంగీకరిస్తే వెనెజువెలాలో అమెరికన్ దళాలను మోహరించాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

ఇలా ఉండగా వెనెజువెలా అధ్యక్షుడు మదురోను గద్దె దించడంపై అమెరికా చర్యను వెనెజువెలా తాత్కాలిక ప్రధాని డెర్సీ రోడ్రిగ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే మదురోను తమ దేశానికి పంపించివేయాలని ఆమె అమెరికాను కోరారు.















