Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం.. ఏడు దేశాలపై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, ప్రజా భద్రతను సాకుగా చూపుతూ మరికొన్ని దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఏడు దేశాలపై నిషేధం, మరో 15 దేశాలపై ప్రవేశ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. తాజా నిర్ణయంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్య 39కి పెరిగింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. ఇందులో బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియాలు ఉన్నాయి. వీటితో పాటు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారు అమెరికాకు వలస రాకుండా పూర్తి నిషేధం విధించారు. గతంలో పాక్షిక ఆంక్షలు ఉన్న లావోస్, సియెర్రా లియోన్ దేశాలను కూడా ఇప్పుడు పూర్తి నిషేధిత జాబితాలోకి మార్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events