అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ జాతీయ కమిటీ అగ్ర దాతల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్`22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలని అన్నారు. ఆ తర్వాత చైనానే ఆ పని చేసిందని అమెరికా చెప్పాలని, దీంతో రష్యా, చైనా పోట్లాడుకుంటే మనం ఎంచక్కా కూర్చొని చూడవచ్చంటూ హస్యమాడారు. దీంతో సభలోని వారంతా నవ్వడంతో పాటు చప్పట్లు కొట్టారు. రష్యా అణు శక్తి కావడంతో దాడి చేయలేమని చెప్పడం బైడెన్ మానేయాలని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరు చేసినప్పటికీ సరైనవా? అని ప్రశ్నించారు. రష్యా అణు శక్తి మనకు చెప్పినందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)