
మీడియా సంస్థలపై, వార్తా పత్రికలపై తరచూ న్యాయ పోరాటానికి దిగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి చిక్కే వచ్చి పడింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న చందంగా ట్రంప్‌పై పులిట్జర్ ప్రైజ్ బోర్డు దావా వేసి ఆయనకు షాక్ ఇచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన జర్నలిజం బహుమతులను ప్రదానం చేస్తూ, పత్రికా స్వేచ్ఛకు పర్యాయ పదంగా నిలిచిన ఈ బోర్డు దేశాధ్యక్షుడినే ఇరకా టంలో పెట్టింది. ట్రంప్ వైద్య రికార్డులు అందజేయాలని, ఆయనకున్న అపారమైన వ్యక్తిగత సంపదకు సంబంధించిన సమా చారాన్ని సవివరంగా ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతేకాదు… ఆ సంపదను ఆయన ఎలా పోగేశారో కూడా తెలియజే యాలని కోరింది.















