Skip to main content

Namaste NRI

ఇరాన్ చేసిన శాంతి ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ ప్ర‌తిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తిర‌స్క‌రించారు. ఆ ప్ర‌తిపాద‌న పూర్తిగా ఆమోద‌యోగ్యం లేద‌న్నారు. కానీ ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. ఇక రిప‌బ్లిక‌న్ పార్టీ నేత ఒక‌రు ఇరాన్‌పై మ‌ళ్లీ మిలిట‌రీ చ‌ర్య చేప‌ట్టాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన ఇరాన్‌తో వార్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి ముగింపు ప‌లికే సంద‌ర్భం వ‌చ్చిన‌ట్లు భావించారు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తిర‌స్క‌రించారు. ఇరానీ ప్ర‌తినిధులు పంపిన ప్ర‌తిపాద‌న‌ను ఇప్పుడే చదివాను, అవి నాకు న‌చ్చ లేదు, అవి ఆమోద‌యోగ్యంగా లేవు అని ట్రంప్ తెలిపారు. గడిచిన 50 ఏళ్ల నుంచి అమెరికాతో టెహ్రాన్ ఆట‌లాడుతోంద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. ఇక వాళ్లు న‌వ్వుకునే రోజులు ముగిసాయ‌న్నారు. వాళ్లు పంపిన లెట‌ర్ నాకు న‌చ్చ‌లేదు, అది స‌రిగా లేదు, వాళ్ల రెస్పాన్స్ బాగాలేద‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events