Skip to main content

Namaste NRI

సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియాకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో రియాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఘనంగా స్వాగతం పలికారు. ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం సౌదీ గగనతలంలోకి చేరుకోగానే, రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌  కు చెందిన ఎఫ్‌-15 విమానాలు  ఎస్కార్ట్‌గా వచ్చాయి.

అధ్యక్షుడు ట్రంప్‌ నాలుగు రోజుల పాటు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు.  ఇక ట్రంప్‌ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌, ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ రైట్‌ కూడా పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు.

Social Share Spread Message

Latest News