అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యం లో ఆమెతో ముఖాముఖి చర్చ జరిపేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమ య్యారు. ఈ మేరకు ఫాక్స్‌న్యూస్ ఆఫర్‌ను ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్ తాజాగా వెల్లడించా రు. వచ్చే నెలలో వీరి మధ్య డిబేట్ జరగనుంది. ట్రంప్- హారిస్ చేత లైవ్ డిబేట్ నిర్వహిస్తామని ఫాక్స్ న్యూస్ వెల్లడిచింది. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే చర్చలో పాల్గొంటానని ట్రంప్ అంగీకారం తెలిపారు.
దీంతో డొనాల్డ్ ట్రంప్- కమలా హారిస్ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పెన్సిల్వేనియాలో తొలి చర్చ జరగనుంది. చర్చ జరిగే సమయంలో చుట్టూ ప్రేక్షకు లు కూడా ఉంటారు. ఆ చర్చకు బ్రెట్ బెయిర్, మార్తా మెక్‌కల్లం వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. గత చర్చ వేదికల మాదిరిగా నిబంధనలు వర్తిస్తాయని ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది.