అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర డకోటా రిపబ్లికన్ అధ్యక్ష కాకసస్లో నెగ్గారు. దీనితో ట్రంప్ విజయాల పరంపర కొనసాగుతోంది. 12 కాకస్ ప్రదేశాల్లో నిర్వహించిన వోటింగ్లో ట్రంప్ మొదటి స్థానం పొందారు. నిక్కీ హేలీ రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఫలితంతో ట్రంప్ తిరిగి గెలుపు బాట పట్టినట్లు అయింది. కొలంబియా జిలా ప్రైమరీలో హేలీ తన ప్రచారంలో తొలి విజయం సాధించింది. శ్వేత సౌధంలో పగ్గాలను ఆశిస్తున్న అభ్యర్థులు 16 రాష్ట్రాల నుంచి ఫలితాలు రానున్న సూపర్ ట్యూస్డే పై తమ దృష్టి కేంద్రీకరిస్తారు. అధ్యక్ష ప్రైమరీలో ఏ రోజునైనా ఏకైక అతిపెద్ద డెలిగేట్ ఫలితం తేల్చే ఫలితాలు అవి. ట్రంప్, అధ్యక్షుడు జో బైడెన్ (డెమోక్రాట్) తమ తమ పోటీలలో ఆధిపత్యం వహిస్తున్నారు. వారిద్దరు ఈ నెల ద్వితీయార్ధంలో తమ నామినేషన్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)