అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ జైలుకెళ్లారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదయిన నేపథ్యంలో ఆయన పోలీసులకు లొంగిపోవలసి ఉంది.ఈ మేరకు జార్జియ జైలు వద్ద పోలీసులకు లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌కౌంటీ జైలుకు వెళిలొంగిపోయి 2 లక్షల డాలర్ల విలువైన బాండ్ సమర్పించి బెయిలు తీసుకునేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీఫానీ విల్లీస్ అనుమతించారు.దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. ట్రంప్ జైలులో దాదాపు 22 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిలుపై బైటికి వచ్చారు. కాగా, జైలులో మగ్‌షాట్ (పోలీసు రికార్డుల కోసం ఫొటో) తీయించుకొన్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. గత ఐదునెలల్లో ట్రంప్ ఐదుసార్లు అరెస్ట్ అయ్యారు. కానీ పోలీసు కేసు కింద బుక్ చేసి తొలిసారిగా మగ్‌షాట్ తీశారు. ఈ ఫొటోను ట్రంప్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమకు తాముగా లొంగిపోయినా అరెస్ట్ కిందే పరిగణిస్తారు.
