అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మేరియన్ ట్రంప్ బారీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. న్యూయార్క్ లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే మేరియన్ మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.మేరియన్ 1974లో అసిస్టెంట్ అటార్నీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. యూఎస్ ఫెడరల్ జడ్జిగా పని చేసిన ఆమె, 2019లో పదవీ విరమణ పొందారు. డొనాల్డ్ ట్రంప్‌కు మొత్తం నలుగురు తోబుట్టువులు. ఆగస్టు 2020లో ట్రంప్ సోదరడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోదరి మేరియన్ ప్రాణాలు కోల్పోయారు. మేరియన్ తన రాబర్ట్ ట్రంప్‌తో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. దీంతో సోదరి మృతితో డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.














