అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అత్త అమలిజా నావ్స్ అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 78. ఈ విషయాన్ని ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తెలియజేశారు. ఈ మేరకు తన తల్లిని కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఎల్లప్పుడూ కరుణ, దయ, గౌరవంతో ముందుకు సాగిందని తెలిపారు. తన జీవితాన్ని పూర్తిగా కుటుంబానికే అంకితం చేసిందని గుర్తు చేసుకున్నారు. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తామంటూ మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు అమలిజా మృతికి ట్రంప్ నివాళులర్పించారు. ఆమె మరణం మొత్తం ట్రంప్ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.
