ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్ ఉంటుందని తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా సంస్థలకు పన్నులను తగ్గించడానికి న్యూ ఢిల్లీ సిద్ధంగా ఉందన్నారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అది ఓ కొత్త డీల్ అవుతుంది. అయితే, ప్రస్తుతం భారత్ ఆ డీల్‌ను ఇంకా అంగీకరించలేదు. ఒక వేళ వాళ్లు అంగీకరిస్తే, చాలా తక్కువ సుంకాలతో డీల్ కుదురుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.















