భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్దనే చాలా డబ్బులు ఉన్నాయని, ఆ దేశానికి అమెరికా ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించారు. భారత్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘానికి అమెరికా రూ.182 కోట్లు ఇచ్చిందని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ వెల్లడించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఫ్లోరిడాలో ఆయన మాట్లాడుతూ భారత్లో ఓటింగ్ పెంచేందుకు మనం రూ.182 కోట్లు ఎందుకు ఇవ్వాలి? అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి. మనపై అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అని అన్నారు. కాగా, పరస్పర సుంకాల విషయంలో తనతో ఎవరూ వాదించలేరని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మీరు ఎలా సుంకాలు విధిస్తే తామూ అలానే విధిస్తామని మోదీకి స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు.
