Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన .. భారత్‌తో త్వరలోనే  

 భారత్‌తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణజ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. వైట్‌హౌస్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారన్నారు. చైనాతో నిన్ననే వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశామని తెలిపారు. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో భారత్‌తో ఒక భారీ ఒప్పందం జరగొచ్చని వెల్లడించారు. భారత్‌లో తాము మార్కెట్లు తెరవబోతున్నామని పేర్కొన్నారు. కాగా, తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదన్నారు. వాటితో ఎలాంటి వాణిజ్యం ఉండదని స్పష్టం చేశారు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి,  25, 35 లేదా 45 శాతం పన్నులు చెల్లించాలని చెబుతామన్నారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలను వేగంగా రవాణా చేయడానికి ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News