పాకిస్థాన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో ఆయన పాక్‌ను విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ట్రంప్ రాకపై తమకు సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పాకిస్థాన్‌లో పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా ఆయన భారత్‌కు కూడా వెళ్తారని పేర్కొన్నాయి.

అమెరికా, పాకిస్థాన్ మధ్య ఇటీవల బంధం బలోపేతమైంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌజ్‌లో అసాధారణ రీతిలో ట్రంప్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.సుమారు రెండు దశాబ్ధాల క్రితం అమెరికా అధ్యక్షుడు పాక్‌లో పర్యటించారు. 2006లో ఆనాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆ దేశాన్ని విజిట్ చేశారు.















