Namaste NRI

అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం

రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు. మేరిల్యాండ్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  డాక్టర్ హేమప్రసాద్ యడ్ల, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.

డాక్టర్ హేమప్రసాద్ యడ్ల మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలని సూచించారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏనాటికైనా తెలుగువారు అమెరికా అధ్యక్షులు కావాలని ఎన్టీఆర్ ఆశించేవారు’ అంటూ ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఒక శకం ముగిసింది, ఒక తార రాలిపోయింది, ఒక గొంతు మూగబోయింది, ఒక తరం అంతరించిపోయింది. పీడిత జన హృదయాల్లో నుంచి ఉద్భవించిన నిలువెత్తు చైతన్యం. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్‌కు శత వసంతాల నీరాజనం. ఎన్టీఆర్ కాలాన్ని ప్రత్యేక యుగంగా, ఆయనొక యుగపురుషుడిగా తెలుగుసమాజం భావిస్తోంది. అందుకే ఆయన జీవితం అనేక యుగాల వారికి ఆదర్శం  అని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో జానకిరామ భోగినేని, ప్రసాద్ గనపనేని, శ్రీనాథ్ రావుల, శివ నెల్లూరి, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, ఆంధ్రాబ్యాంక్ రామ్మోహన్ రావు, ఆకర్ష్ వలివేటి, శ్రీనాథ్ కాండ్రు, శ్రీనివాస్ పైడి, రాంబాబు యలమంచిలి, సుధీర్ నిమ్మగడ్డ, హేమంత్ కాలే, వేణు గోరంట్ల, సుందర్ క్రోసూరి, సీతారాం గంది తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events